![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -665 లో.....సూరజ్ తన స్టాప్ రాగానే దిగుతాడు. మేడం ని తన కార్ దగ్గర డ్రాప్ చెయ్యమని ఆటో అతనికి చెప్తాడు. నా కార్ కీస్ ఇంకా ఫోన్ అని జ్యోత్స్న అడుగుతుంది. దాంతో నువ్వు నాతో గొడవని మనసులో పెట్టుకొని రివెంజ్ ప్లాన్ చేసావ్.. అది ముందే గమనించి నీకు బుద్ది వచ్చేలా చెయ్యాలని ఇలా చేసానని తన ఫోన్,కార్ కీస్ ఇస్తాడు సూరజ్. ఇంకొకసారి ఎవరి విషయంలో ఇలా చేయకని జ్యోత్స్న కి సూరజ్ తనకి వార్నింగ్ ఇస్తాడు.
ఆ తర్వాత జ్యోత్స్న ఇంటి గేట్ వరకు వచ్చాక దీప తనకి కాల్ చేస్తుంది. అమ్మాయి గారు ఎక్కడున్నారు.. ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతున్నారని అంటుంది. నా గురించి నీకెందుకు.. నీ మొగుడు గురించి నువ్వు ఆలోచించుకో త్వరలో నీ మొగుడు ని నేను పెళ్లి చేసుకుంటా.. అప్పుడు నువ్వు మాజీ భార్యవి అవుతావని జ్యోత్స్న మాట్లాడుకుంటూ లోపలికి వస్తుంది. అందరు హాల్లో ఉంటారు. దీప స్పీకర్ లో పెట్టి మాట్లాడుతుంది. అందరు వినేశారని జ్యోత్స్న షాక్ అవుతుంది. మీరేంటి ఇక్కడ అని జ్యోత్స్న వాళ్ళని అడుగుతుంది. నువ్వు లేవని ఇంట్లో కంగారుపడుతుంటే వచ్చామని కార్తీక్ చెప్తాడు. నువ్వు మారవా.. ఇక మొన్న దీప నీతో అలా మాట్లాడ్డంలో తప్పేం లేదని సుమిత్ర అంటుంది. ఎంత దైర్యమే నీకు.. తన మొగుడిని పెళ్లి చేసుకుంటానని తనకే చెప్తావా అని జ్యోత్స్నని పారిజాతం కోప్పడుతుంది. నీకు భయం గానీ బాధ్యతలు గానీ ఏం లేవని జ్యోత్స్నని సుమిత్ర కోప్పడుతుంది. సారీ మమ్మీ అని జ్యోత్స్న చెప్తుంది. అందరు లోపలికి వెళ్ళాక.. మొన్న స్పీకర్ లో పెట్టి వినిపించానని ఇప్పుడు ఇలా చేసావా అని దీపతో జ్యోత్స్న అంటుంది. పాప వెళ్లి బువ్వ తిని బజ్జో అమ్మ అని జ్యోత్స్నతో కార్తీక్ వెటకారంగా మాట్లాడతాడు.
ఆ తర్వాత ఇంత అర్థరాత్రి వాళ్ళు ఇంటికి వెళ్లడం అవసరమా.. ఆ జ్యోత్స్న కి భయం లేదు అలా పెంచారు వాళ్ళు అని దీప, కార్తీక్ పై కాంచన కోప్పడుతుంది. ఆ తర్వాత జరిగింది గుర్తుచేసుకొని జ్యోత్స్న కోపంగా ఉంటుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది అసలు నిన్ను సీఈఓ అవనివ్వనని పారిజాతం అంటుంది. మరుసటి రోజు దీప, కార్తీక్ వెళ్తుంటే దారిలో సూరజ్ కన్పిస్తాడు .తన దగ్గరికి వెళ్లి ఇద్దరు మాట్లాడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |